RBI Assistant Jobs 2026: ఆర్బీఐలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తన శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా ముంబయి కేంద్రంలో 249 పోస్టులు ఉండగా, హైదరాబాద్‌లో 11 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. పోస్టుల పంపిణీ కేంద్రాల వారీగా చూస్తే, ముంబయిలో 249, చెన్నైలో 53, కాన్పూర్,లక్నోలో కలిపి 50, న్యూఢిల్లీ లో 49, గువాహటిలో 36, భోపాల్‌లో 30, కోల్‌కతాలో 29 పోస్టులు ఉన్నాయి.
వివరాలు
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో..
అలాగే బెంగళూరులో 24, అహ్మదాబాద్‌లో 20, చండీగఢ్‌లో 20, భువనేశ్వర్‌లో 18, నాగ్‌పూర్‌లో 17, పట్నాలో 17 ఖాళీలు ఉన్నాయి. జైపూర్, హైదరాబాద్ కేంద్రాల్లో తలా 11 పోస్టులు ఉండగా, తిరువనంతపురం మరియు కొచ్చిలో కలిపి 10, జమ్మూలో 6 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వర్గాలకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అలాగే ఆయా ప్రాంతాల స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.
వివరాలు
వయోపరిమితి
వయోపరిమితి విషయానికి వస్తే, ఫిబ్రవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అర్హత కలిగిన వారు మార్చి 8, 2026లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.450,ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 మాత్రమే చెల్లించాలి. ప్రిలిమ్స్,మెయిన్ రాత పరీక్షలు,భాషా నైపుణ్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,514 ప్రాథమిక జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు అందజేస్తారు.
వివరాలు
ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం - ఫిబ్రవరి 16, 2026 దరఖాస్తుకు చివరి తేదీ - మార్చి 8, 2026 ప్రిలిమినరీ రాత పరీక్ష - ఏప్రిల్ 11, 2026 మెయిన్ రాత పరీక్ష - జూన్ 7, 2026 రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.