LOADING...
AU Small Finance Bank: యూనివర్సల్ బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఆర్బీఐ ఆమోదం
యూనివర్సల్ బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఆర్బీఐ ఆమోదం

AU Small Finance Bank: యూనివర్సల్ బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఆర్బీఐ ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు 'సూత్రప్రాయంగా' (In-Principle) ఆమోదం తెలిపింది. 2024 సెప్టెంబర్ 3న, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్వచ్ఛందంగా యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు RBIకి అధికారిక దరఖాస్తు సమర్పించింది. ఆ దరఖాస్తును పరిశీలించిన RBI, యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో అతి పెద్దదైన ఏయూ బ్యాంక్, ఈ గురువారం అధికారికంగా 'సూత్రప్రాయంగా' ఆమోదం పొందింది.

వివరాలు 

ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు RBI నిర్ణయించిన అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి: 

కనీసం ఐదు సంవత్సరాల పాటు RBI నియమావళి ప్రకారం సంతృప్తికరమైన పనితీరు రికార్డు ఉండాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అయి ఉండాలి. కనీసం రూ.1,000 కోట్ల నికర విలువ (Net Worth) కలిగి ఉండాలి. అలాగే, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (GNPA) 3% కన్నా తక్కువగా లేదా సమానంగా ఉండాలి. నెట్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (NNPA) 1% కన్నా తక్కువగా లేదా సమానంగా ఉండాలి.

వివరాలు 

ఏప్రిల్ 2017లో బ్యాంకింగ్ రంగంలోకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (AU SFB) ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఏప్రిల్ 2017లో బ్యాంకింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ కాలంలోనే ఇది దేశంలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా ఎదిగింది. దీనిని 1996లో సంజయ్ అగర్వాల్ స్థాపించారు. ప్రస్తుతం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా ఉన్న సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ .."యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు RBI నుండి 'సూత్రప్రాయంగా' ఆమోదం పొందడం, మా బ్యాంక్ చరిత్రలో ఒక మైలురాయి. ఇది మాకు గర్వకారణం" అని తెలిపారు.