RBI MPC Meeting: మరోసారి వడ్డీరేట్లలో మార్పు లేదు.. రెపో రేటు 5.25% యథాతథం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతానికి రెపో రేటును 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచడం వరుసగా నాలుగోసారి కావడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో నిర్వహించిన ద్రవ్య పరపతి సమీక్షల్లో కూడా ఆర్‌బీఐ ఇదే విధానాన్ని అనుసరించి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. దీంతో బ్యాంకుల రుణాలపై వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.
వివరాలు
గతేడాది మొత్తం కలిపి రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది
అయితే, గతేడాది పరిస్థితి భిన్నంగా ఉండింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో ఆర్‌బీఐ రెపో రేటును ఒక్కోసారి 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది.
అనంతరం జూన్ ద్రవ్య పరపతి సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది.
ఆ తర్వాత డిసెంబరులో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇలా గతేడాది మొత్తం కలిపి రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది.