Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండు సెషన్లుగా కొనసాగిన లాభాల జోరుకు బ్రేక్ పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను పెంచడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో రెపో రేటు 5.5శాతానికి చేరింది. దీంతో ముఖ్యంగా మెటల్,రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ క్రితం ముగింపు 73,067.81 పాయింట్లతో పోలిస్తే 72,965.38 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ మొత్తం సూచీ నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,468.72పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 429.11 పాయింట్లు నష్టపోయి 72,638.70 వద్ద స్థిరపడింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 101.93 డాలర్లు
మరోవైపు నిఫ్టీ కూడా 173.05 పాయింట్లు కోల్పోయి 22,603.05 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.77గా నమోదైంది.
సెన్సెక్స్ 30లో కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.
మిగతా కంపెనీల షేర్లన్నీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 101.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇదే సమయంలో బంగారం ఔన్స్ ధర 4,116.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.