యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు
యూపీఐ లైట్(UPI Lite) ద్వారా 200రూపాయల వరకు పిన్ నంబర్ అక్కర్లేకుండానే లావాదేవీలు జరిపే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిమిట్ ని మరింత పెంచారు. ఇకపై 500రూపాయల వరకు ఎలాంటి పిన్ నంబర్ అవసరం లేకుండా డైరక్టుగా పంపవచ్చు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని ఆర్ బి ఐ తీసుకొచ్చింది. ట్రాన్సాక్షన్ లిమిట్ ను పెంచినప్పటికీ యూపైఐ లైట్ వ్యాలెట్ లో 2000రూపాయల కంటే ఎక్కువ డబ్బులను జమ చేసుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకుండా పేమెంట్లు చేయడం వల్ల రిస్కులు పొంచి ఉన్నాయని, అందువల్ల పెంచలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఇకపై యూపీఐలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్
యూపీఐ లో మరో అతిపెద్ద మార్పు రాబోతుందని శక్తికాంత దాస్ వెల్లడి చేసారు. వినియోగాదారులకు సులభమైన మార్గంలో యూపీఐ సేవలను అందించేందుకు యూపీఐ టెక్నాలజీకి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించబోతున్నారు. దీనివల్ల వినియోగదారులు సులభంగా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడుతూ ట్రాన్సాక్షన్ జరపవచ్చని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ముందుగా ఈ సౌకర్యం ఇంగ్లీష్, హిందీ భాషల్లో వస్తుందని ఆ తర్వాత ఇతర భాషల్లోకి సేవలను అందజేస్తామని శక్తికాంత దాస్ అన్నారు.