LOADING...
Kisan Credit Card: రైతులకు శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు విడుదల.. కీలక మార్పులు ఇవే!
కీలక మార్పులు ఇవే!

Kisan Credit Card: రైతులకు శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు విడుదల.. కీలక మార్పులు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యవసాయ రంగానికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు అమలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రైతులు తక్కువ వడ్డీ రేటుతో పంట రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రస్తుతం రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం అందుతోంది. రుణాన్ని గడువులోగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కూడా లభిస్తోంది.అలాగే నిర్దిష్ట పరిమితి వరకు ఎలాంటి తాకట్టు లేకుండానే రుణం పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని నిబంధనలను సవరించి, బ్యాంకులు అనుసరించాల్సిన తాజా నియమాలను ప్రకటించింది.

వివరాలు 

2027 జనవరి నుంచి అమలు

'కమర్షియల్ బ్యాంక్స్ - కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ డైరెక్షన్స్, 2026' పేరుతో ఆర్‌బీఐ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తుది నిబంధనలను ఖరారు చేసింది. పూచీకత్తు లేని రుణాలపై స్పష్టత కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద పూచీకత్తు లేకుండా అందించే రుణ పరిమితిని మరింత పెంచాలనే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలించింది. అయితే 2024 డిసెంబర్‌లోనే ఈ పరిమితిని పెంచినందున ప్రస్తుతం మరోసారి పెంపుపై ముందుకు వెళ్లలేదు.

వివరాలు 

బ్యాంకులకు కీలక ఆదేశాలు

వ్యవసాయం,వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రూ.2 లక్షల వరకు మంజూరు చేసే రుణాలకు బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేదా మార్జిన్ మనీ కోరరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రూ.2 లక్షలకు మించిన రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు తమ అంతర్గత రుణ విధానాలు, ప్రస్తుత నిబంధనల ప్రకారం పూచీకత్తు, మార్జిన్ అవసరాలను నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. పంటలు లేదా పశువులను ఆధారంగా చేసుకుని రికవరీ ఒప్పందాల కింద మంజూరైన కేసీసీ రుణాలకు సంబంధించి కూడా ఆర్‌బీఐ కీలక సూచనలు చేసింది. ఇలాంటి సందర్భాల్లో రూ.3 లక్షల వరకు ఉన్న రుణాల విషయంలో బ్యాంకులు భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించింది.

Advertisement

వివరాలు 

బ్యాంకులకు కీలక ఆదేశాలు

అలాగే పంట సాగు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం మంజూరు చేసే స్వల్పకాలిక రుణ పరిమితులను బ్యాంకులు నిరంతరం సమీక్షించి అవసరానికి అనుగుణంగా పునరుద్ధరించాలని సూచించింది. రైతుల అవసరాలు, మారుతున్న వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రుణ పరిమితులను సవరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రతి బ్యాంకు తమ అంతర్గత రుణ విధానాలకు అనుగుణంగా ఈ సమీక్షలను నిర్వహించి, రైతులకు అవసరమైన ఆర్థిక సాయం సకాలంలో అందేలా చూడాలని కేంద్ర బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement