RBI: రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్‌లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది. సోమవారం విడుదలైన డేటా ప్రకారం, RBI ఆ నెలలో మొత్తం 7.91 బిలియన్ డాలర్లను నెట్‌గా అమ్మింది. సెప్టెంబర్‌లో రూపాయి 88.80 రూపాయల చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడంతో, కరెన్సీ స్థిరత్వం కోసం ఈ చర్య చేపట్టింది. ఇదే తరహా ఒత్తిడుల మధ్య ఆగస్టులో కూడా RBI 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, అలాగే బంగారం-వెండి దిగుమతులు అకస్మాత్తుగా పెరగడం రూపాయి మీద మరింత ఒత్తిడి తేవడంతో సెప్టెంబర్ depreciation తీవ్రంగా కనిపించింది.
వివరాలు
భారత ఎగుమతులపై పెరిగిన శిక్షాత్మక సుంకాలు
నవంబర్ 21 నాటికి రూపాయి మరోసారి కొత్త కనిష్టమైన 89.49 ను తాకి,ఈ సంవత్సరం ఇప్పటివరకు 4.5% పడిపోయింది. సెప్టెంబర్ చివరి నాటికి RBI ఫార్వర్డ్, ఫ్యూచర్ మార్కెట్‌లో నెట్ అవుట్‌స్టాండింగ్ డాలర్ సేల్స్ 59.4 బిలియన్ డాలర్లకు చేరి,ఆరు నెలల్లో మొదటిసారి పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ డేటా చెబుతోంది. రూపాయి ఆకస్మిక మార్పులను నియంత్రించేందుకు RBI స్పాట్ మార్కెట్‌తో పాటు ఫార్వర్డ్ మార్కెట్లో కూడా జోక్యం చేసుకుంటోంది. భారత ఎగుమతులపై పెరిగిన శిక్షాత్మక సుంకాలు,ఇతర మార్కెట్ అంశాల కారణంగా ఇటీవల రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతుండటంతో ఈ జోక్యాలు పెరిగాయి. గత శుక్రవారం రూపాయి కీలక స్థాయిని దాటడంతో,సోమవారం RBI దూకుడుగా జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని ఆపడానికి చర్యలు తీసుకుంది.
వివరాలు
రూపాయి మీద ప్రతికూల ప్రభావం
దీంతో రూపాయి విలువ కొంత కోలుకుని, డాలర్‌కు 89.16 వద్ద 0.35% పెరుగుదలతో ట్రేడైంది. డాలర్ డిమాండ్ అధికంగా ఉండటం రూపాయి బలహీనతకు ప్రధాన కారణమని, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరితే రూపాయి మరింత స్థిరపడే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రూపాయి కోసం పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, మార్కెట్ భావజాలాన్ని మార్చే స్పష్టమైన సంకేతాలు ఇంకా కనిపించట్లేదని ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఒక సీనియర్ ట్రెజరీ అధికారి పేర్కొన్నారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడం కూడా రూపాయి మీద ప్రతికూల ప్రభావం చూపుతోందని ట్రేడర్లు అంటున్నారు.