తదుపరి వార్తా కథనం

Restrictions On Rice Exports: బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించిన కేంద్రం
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 24, 2024
01:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది.
బాస్మతి బియ్యానికి సంబంధించి కనీస ఎగుమతి ధర (టన్నుకు 490 డాలర్లు)ను ఉపసంహరించిందని ప్రకటించింది.
అలాగే, పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌లపై ఉన్న ఎగుమతి సుంకాన్ని కూడా రద్దు చేసింది.
ఈ సుంకం గతంలో 10%గా ఉండగా, ఈ మార్పు ఈ నెల 22న అమలులోకి రానుంది.
గత నెలలో ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం మీద ఎగుమతి సుంకాన్ని తొలగించిన సంగతి తెలిసిందే.
ఇక, పారాబాయిల్డ్, బ్రౌన్, వరిబియ్యం లెవీని 20% నుండి 10%కి తగ్గించడంతో పాటు, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను కూడా రద్దు చేయడం జరిగింది.