Rolls-Royce: భారత్‌లో రోల్స్ రాయిస్ భారీ ప్రణాళికలు.. వెల్లడించిన సీఈఓ తూఫాన్ ఎర్గిన్‌బిల్గిచ్
ఈ వార్తాకథనం ఏంటి
మనదేశంలో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తామని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సంస్థ రోల్స్ రాయిస్ ప్రకటించింది. భారత వాయుసేన కోసం రూపొందిస్తున్న తదుపరి తరం యుద్ధ విమానాల 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్‌సీఏ)' ప్రోగ్రామ్‌లో భాగంగా ఏరో ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ సీఈఓ తూఫాన్ ఎర్గిన్‌బిల్గిచ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి మేధోసంపత్తి హక్కుల బదిలీతోనే చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత త్రివిధ దళాల్లో ఉపయోగంలో ఉన్న వివిధ రక్షణ వేదికల్లో 1,400కు పైగా రోల్స్ రాయిస్ ఇంజిన్లు సేవలందిస్తున్నాయి అని తెలిపారు.
వివరాలు
ఎస్‌ఎమ్‌ఈలకు అవకాశాలు
దేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసి 10,000కు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, అత్యాధునిక తయారీకి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దీర్ఘకాల వ్యూహంలో భాగంగా స్థానిక సరఫరా వ్యవస్థ వనరులను పది రెట్లు పెంచాలని భావిస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎమ్‌ఈలు) గణనీయమైన అవకాశాలు లభించనున్నాయి. ఇతర దేశాల్లో తమ వ్యాపార వ్యవస్థను విజయవంతంగా విస్తరించినట్లే, భారత్‌లోనూ రక్షణ, విమానయాన, ఇంధన రంగాల్లో వేగంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తూఫాన్ పేర్కొన్నారు.
వివరాలు
100కు పైగా వెండార్లతో సోర్సింగ్ భాగస్వామ్యాలు
ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్‌లో తమ కార్యకలాపాలను పెంచాలన్న రోల్స్ రాయిస్ ఉత్సాహాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. హెచ్‌ఏఎల్, ఫోర్స్ మోటార్స్‌తో తయారీ సంయుక్త సంస్థలు; టాటా, భారత్ ఫోర్జ్, గోద్రేజ్ వంటి 100కు పైగా వెండార్లతో సోర్సింగ్ భాగస్వామ్యాలు ఈ కంపెనీకి ఉన్నాయి.యి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
It was wonderful meeting Mr. Tufan Erginbilgic, CEO of Rolls-Royce earlier today.
— Narendra Modi (@narendramodi) February 11, 2026
We welcome Rolls-Royce’s enthusiasm towards scaling up its activities in India and partnering with our innovative and dynamic youth. https://t.co/ZWj3EcQR7c