Loading...
Rupee: మూడు రోజుల నష్టాలకు చెక్.. డాలర్ బలహీనతతో పుంజుకున్న రూపాయి
మూడు రోజుల నష్టాలకు చెక్.. డాలర్ బలహీనతతో పుంజుకున్న రూపాయి

Rupee: మూడు రోజుల నష్టాలకు చెక్.. డాలర్ బలహీనతతో పుంజుకున్న రూపాయి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడు రోజులుగా కొనసాగిన వరుస నష్టాలకు భారత రూపాయి శుక్రవారం బ్రేక్ వేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రారంభ ట్రేడింగ్‌లో 4 పైసలు బలపడి 96.31 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి 96.35 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనపడటం రూపాయికి కొంత ఊరటనిచ్చింది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే డాలర్ ఇండెక్స్ నెల రోజుల కనిష్ఠ స్థాయికి చేరడంతో రూపాయికి మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ తక్షణమే వడ్డీ రేట్లు పెంచే అవకాశం తగ్గిందనే అంచనాలు మార్కెట్లో బలపడ్డాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85 డాలర్లు 

ఈ పరిణామంతో డాలర్ విలువ క్షీణించింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జులైలో వడ్డీ రేట్ల పెంపు ఉండే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ, సెప్టెంబర్ సమావేశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం రూపాయి లాభాలను పరిమితం చేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరువైంది.

ఉదయం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ 1.48 శాతం పెరిగి 85.48 డాలర్ల వద్ద ట్రేడవగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 1.60 శాతం ఎగసి బ్యారెల్‌కు 80 డాలర్ల వద్ద కొనసాగింది.

వివరాలు 

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

ఇక ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ నాలుగు శాతానికి పైగా క్షీణించగా, హాంగ్‌కాంగ్, చైనా స్టాక్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

మరోవైపు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.

దీంతో దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.

ADVERTISEMENT