Salary account: శాలరీ అకౌంట్‌తో లభించే అద్భుతమైన ఆఫర్లు, ప్రయోజనాలు ఇవే..
ప్రస్తుతం దాదాపు ప్రతి ఉద్యోగి జీతం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. ఈ కారణంగా ఉద్యోగం ప్రారంభంలోనే శాలరీ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణ బ్యాంక్ ఖాతాలానే ఉంటుంది, కానీ ఇందులో కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి, వీటిని చాలా మంది ఉద్యోగులు గుర్తించరు. ఈ శాలరీ ఖాతాతో లభించే ప్రత్యేక ప్రయోజనాలను తెలుసుకుందాం.
లోన్ వడ్డీ రేట్లు
శాలరీ ఖాతా ఉన్నవారికి పర్సనల్, హోమ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి. బ్యాంకులు ఈ ఖాతా హోల్డర్లకు ప్రత్యేక లోన్ ఆఫర్లు అందిస్తాయి. శాలరీ ఖాతా ఉండటం వల్ల అవసరమైనప్పుడు లోన్‌ను సులభంగా పొందవచ్చు. జీరో బ్యాలెన్స్ శాలరీ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లలాగా బ్యాలెన్స్‌ను గూర్చి ఆలోచించకుండా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు చాలా బ్యాంకులు శాలరీ ఖాతా ఉన్నవారికి వేగవంతమైన సేవలు, ప్రత్యేక కస్టమర్ కేర్ నంబర్, పర్సనలైజ్డ్ సపోర్ట్ అందిస్తాయి.
ఉచిత క్రెడిట్ కార్డ్‌లు
కొన్ని బ్యాంకులు శాలరీ ఖాతా హోల్డర్లకు ఉచిత క్రెడిట్ కార్డులను ఇస్తాయి. ఇవి ఫీజు డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు వంటి ప్రయోజనాలతో వస్తాయి. షాపింగ్, డైనింగ్‌పై డిస్కౌంట్లు ఆన్‌లైన్ షాపింగ్, డైనింగ్‌పై ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు. బ్యాంకులు ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తాయి. ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ శాలరీ ఖాతా ఉన్నవారు తమ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని మించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫెసిలిటీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇన్సూరెన్స్ కవరేజీ
కొన్ని శాలరీ ఖాతాలు యాక్సిడెంట్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. అనుకోని పరిస్థితుల్లో మీరు, మీ కుటుంబానికి భద్రతను అందిస్తాయి. ఉచిత డెబిట్ కార్డ్, చెక్‌బుక్ సర్వీసు బ్యాంకులు సాధారణంగా ఉచిత డెబిట్ కార్డ్‌లు, చెక్‌బుక్‌లను అందిస్తాయి. ఇది లాంగ్-టెర్మ్‌లో చిన్న చిన్న ఖర్చులను ఆదా చేస్తుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్లు శాలరీ ఖాతాలకు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లు లభిస్తాయి. మరీ ఎక్కువగా ట్రాన్సాక్షన్లు చేయాల్సిన అవసరమైతే ఏటీఎం ట్రాన్సాక్షన్‌లకు మరింత ఎక్కువ లిమిట్ ఉంటుంది. ఉచిత డిజిటల్ ట్రాన్సాక్షన్లు NEFT, RTGS వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉచితంగా అందించబడతాయి.