Page Loader
Sam Altman:'తమ సంస్థలోని ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు మెటా భారీ ఆఫర్లు'.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు.. 
'తమ సంస్థలోని ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు మెటా భారీ ఆఫర్లు'.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు..

Sam Altman:'తమ సంస్థలోని ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు మెటా భారీ ఆఫర్లు'.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మెటా‌పై ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్‌మాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో పని చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) నిపుణులను ఆకర్షించేందుకు మెటా భారీ మొత్తంలో ఆఫర్లు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వార్షిక వేతనంతో పాటు, సైన్‌-ఆన్ బోనస్‌గా 100 మిలియన్ డాలర్లు వరకూ ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా తన సోదరుడు జాక్ ఆల్ట్‌మన్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు. మెటా తమను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోందని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. అందుకే తమ సంస్థలోని అత్యుత్తమ ఇంజినీర్లను ఆకర్షించేందుకు దాదాపు రూ.864 కోట్ల విలువైన బోనస్‌లను ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పారు.

వివరాలు  

 ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షిస్తున్న మెటా 

అయితే ఓపెన్‌ఏఐలో తమకు ప్రత్యేకమైన ప్యాకేజీలు అందుబాటులో ఉండటంతో ఒక్క ఉద్యోగి కూడా మెటా ఆఫర్‌ను అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఒక్క డబ్బుతోనే విజయం సాధించడం సాధ్యపడదని, దీర్ఘకాలికంగా ఈ రకమైన భారీ వేతన వ్యూహాలు ఫలించవని అభిప్రాయపడ్డారు. తమ ఏఐ లక్ష్యాలను చేరుకోవడం కోసం మెటా గట్టిగా ప్రయత్నిస్తోంది.ఇటీవల స్కేల్‌ఏఐ మాజీ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో 'సూపర్ ఇంటెలిజెన్స్' అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాక, కృత్రిమ మేధస్సు రంగంలో మెరుగైన పురోగతిని సాధించేందుకు ఇప్పటివరకు 14 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అలాగే ఓపెన్‌ఏఐ, గూగుల్‌ డీప్‌మైండ్‌ల నుంచి ప్రతిభావంతులైన నిపుణులను తమ వైపు ఆకర్షించేందుకు మెటా భారీ వేతనాలను ప్రతిపాదిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.