SEBI: ఆయిల్ కంపెనీలపై BSE , NSE భారీ జరిమానాలు
ఇండియన్ ఆయిల్ (IOC), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), GAIL (ఇండియా) లిమిటెడ్‌తో సహా అనేక ప్రభుత్వ రంగంలోని చమురు గ్యాస్ కంపెనీలపై జరిమానా విధించారు. వరుసగా నాల్గవ త్రైమాసికంలో జరిమానా విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిబంధనలను పాటించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. అందుకే BSE , NSEలు వాటిపై జరిమానా విధించాయి. ప్రత్యేకంగా వారి బోర్డులలో అవసరమైన సంఖ్యలో డైరెక్టర్లు లేకపోవడం కారణంగా ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ల ప్రకారం,జనవరి-మార్చి త్రైమాసికంలోనిబంధనలను పాటించలేదు. దీనితో ఈ కంపెనీలపై 34 లక్షల సంచిత ( క్యుములేటివ్ ) జరిమానా విధించారు. ఐఓసీ, ఓఎన్‌జీసీ, గెయిల్‌తో పాటు ,(బీపీసీఎల్),ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)లపై బోర్డు లోపాలపై ఈ కంపెనీలకు జరిమానా విధించారు.
ఈ కంపెనీలు జరిమానాలను ఎదుర్కోవడం నాలుగో సారి
వీటితో పాటుగా (హెచ్‌పీసీఎల్) , (ఎంఆర్‌పీఎల్)లకు కూడా జరిమానా విధించారు. మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో అవసరమైన సంఖ్యలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు , తప్పనిసరి మహిళా డైరెక్టర్‌లను చేరుకోవడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయి. అందుకు గాను BSE , NSEలు జరిమానాలు విధించాయి.ఈ కారణంగా ఈ కంపెనీలు జరిమానాలను ఎదుర్కోవడం వరుసగా ఇది నాలుగో త్రైమాసికం.ఈ జరిమానాలపై కంపెనీలు స్టాక్ ఎక్సేంజ్ బోర్డులకు బదులిచ్చాయి. డైరెక్టర్‌ల నియమకాల్లో తమ పాత్రలేదని ప్రభుత్వ నిర్ణయాలే శిరోధార్యమని చెప్పాయి.
డైరెక్టర్ల నియామకం ప్రభుత్వ బాధ్యత
డైరెక్టర్ల నియామకం ప్రభుత్వ బాధ్యత అని BSE , NSEలకు నివేదించాయి.ప్రత్యేకంగా, IOC "డైరెక్టర్లను (స్వతంత్ర డైరెక్టర్లతో సహా) నియమించే అధికారం భారత ప్రభుత్వంలోని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు ఉంటుందని పేర్కొంది. బోర్డు అవసరాలను తీర్చడంలో తమ వైఫల్యం లేదని చెప్పాయి. తమ పక్షాన ఎలాంటి నిర్లక్ష్యం , ఫొరపాట్లు లేవని అవి వాదించాయి. పర్యవసానంగా ఈ జరిమానాలను మినహాయించాలని IOC అభ్యర్థించింది.
ఇతర కంపెనీల జరిమానాలను రద్దు చేయాలి
తమపై విధించిన జరిమానాలను రద్దు చేయాలని IOC.. BSE , NSEలను కోరాయి. HPCL , BPCL IOCకూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. డైరెక్టర్ల నియామకం తమ నియంత్రణకాదని, తమ పాత్ర చిన్నదని తెలిపింది.. ఇటువంటి నియామకాలు తమ అధికార పరిధికి లోకి రావని గెయిల్ పేర్కొంది. కాగా, స్వతంత్ర డైరెక్టర్ల నియామకం కోసం OIL మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. MRPL తన బోర్డులో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్ల నియామకం కోసం మంత్రిత్వ శాఖను నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది.