LOADING...
Customers Bank: కస్టమర్స్ బ్యాంకులో సంచలనం.. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో కొత్త దశ!
కస్టమర్స్ బ్యాంకులో సంచలనం.. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో కొత్త దశ!

Customers Bank: కస్టమర్స్ బ్యాంకులో సంచలనం.. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో కొత్త దశ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కంపెనీల ఆర్థిక ఫలితాల కాల్స్ (Earnings Calls)లో సీఈఓ స్వరం అంటే ఇప్పటివరకు నమ్మకం, స్పష్టతకు ప్రతీకగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ భావన మారుతోంది. ఇటీవల కస్టమర్స్ బ్యాంక్ సీఈఓ సామ్ సిద్ధూ చేసిన ఒక ప్రకటన కార్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అనలిస్టులు విన్న స్వరం తనది కాకుండా, తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్లోన్‌దేనని ఆయన వెల్లడించారు. కాల్ మధ్యలో వచ్చిన ఈ వెల్లడితో, అప్పటి వరకు జరిగిన సంభాషణకు కొత్త అర్థం వచ్చేసింది.

వివరాలు

ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్ సంకేతం

ఇది కేవలం గిమ్మిక్ మాత్రమే కాదు... భవిష్యత్ కార్పొరేట్ కమ్యూనికేషన్‌కు సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు కంపెనీలు సీఈఓ "ప్రెజెన్స్"ను సమయం, ప్రదేశం, వ్యక్తిగత హాజరుతో పరిమితం చేయకుండా, AI ద్వారా విస్తరించాలనే దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి. సీఈఓ క్లోన్లు అంటే వ్యక్తి స్వరం, ప్రవర్తన, నిర్ణయ విధానాన్ని అనుకరించే అత్యాధునిక AI వ్యవస్థలు.

వివరాలు

బ్యాంకింగ్ రంగంలో AI విప్లవం

కస్టమర్స్ బ్యాంకు ఈ ఏఐ ప్రయోగాన్ని కేవలం కమ్యూనికేషన్‌కే పరిమితం చేయలేదు. ఓపెన్ ఏఐతో బహువార్షిక భాగస్వామ్యం కుదుర్చుకుని, బ్యాంకింగ్‌లో కీలక ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, ఓపెన్ ఏఐ ఇంజినీర్లు నేరుగా బ్యాంక్‌లో పనిచేస్తూ ఏఐ ఆధారిత సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్పులతో ప్రస్తుతం 45 రోజులు పట్టే లోన్ ప్రాసెసింగ్ కేవలం ఒక వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే, ఖాతా ఓపెనింగ్ ప్రక్రియను 20 నిమిషాల్లో పూర్తి చేసేలా కన్వర్సేషనల్ AI, ఆటోమేటెడ్ డాక్యుమెంట్ హ్యాండ్లింగ్‌ను వినియోగించనున్నారు.

Advertisement

వివరాలు

"డిజిటల్ వర్కర్స్"గా AI

సిద్ధు ఈ ఏఐ సిస్టమ్స్‌ను 'డిజిటల్ వర్కర్స్'గా పేర్కొన్నారు. అంటే ఇవి అలసట లేకుండా, నిరంతరం పని చేసే స్వయం నియంత్రిత వ్యవస్థలు. రుణాలు, డిపాజిట్లు, చెల్లింపులు వంటి విభాగాల్లో వీటిని వచ్చే ఏడాదిలో అమలు చేయాలని బ్యాంక్ భావిస్తోంది. వీటి పనితీరును నేరుగా ఆర్థిక ప్రమాణాలతో—ఎఫిషియెన్సీ, రిటర్న్స్—కలిపి అంచనా వేయనున్నారు.

Advertisement

వివరాలు

ఆర్థిక లాభాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు

సుమారు $25.9 బిలియన్ ఆస్తులు కలిగిన ఈ బ్యాంక్, AI వినియోగంతో తన ఎఫిషియెన్సీ రేషియోను 49% నుంచి 40% కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగుల సంఖ్య పెంచకుండా వ్యాపారాన్ని విస్తరించడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ భాగస్వామ్యం ద్వారా OpenAI కూడా నియంత్రిత ఆర్థిక వాతావరణంలో తన టెక్నాలజీని పరీక్షించే అవకాశం పొందుతుంది. భవిష్యత్తులో ఈ AI సొల్యూషన్స్‌ను ఇతర బ్యాంకులకు కూడా అందించే ప్రణాళిక ఉంది.

వివరాలు

ఇతర టెక్ దిగ్గజాల ప్రయత్నాలు

ఇక మెటా ఫ్లాట్ పార్సహ మెటా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి ప్రయోగాల్లో ముందుంది. సంస్థ సీఈఓ మార్క్ జుకన్‌బర్గ్ సంస్థ 3D AI అవతార్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది ఉద్యోగులతో ప్రత్యక్షంగా మాట్లాడగలగడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలగడం వంటి సామర్థ్యాలతో రూపొందుతోంది. జుకర్‌బర్గ్ స్వరంతో పాటు అతని ఆలోచనా విధానాన్ని కూడా ఇందులో ప్రతిబింబించేలా ట్రైనింగ్ ఇస్తున్నారు.

వివరాలు

నాయకత్వం మారుతున్న రూపం

ఈ పరిణామాలు ఒక పెద్ద మార్పుకు సంకేతం ఇస్తున్నాయి. నాయకత్వం ఇకపై ఒక వ్యక్తి పరిమితిలో ఉండకుండా, పునరుత్పత్తి చేయగలిగిన, విస్తరించగలిగిన వ్యవస్థగా మారుతోంది. అయితే, ఇది విశ్వాసం, బాధ్యత, నిజాయితీ వంటి అంశాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం సీఈఓ క్లోన్లు ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, టెక్నాలజీ అభివృద్ధితో ఇవి మరింత విస్తరించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మాట్లాడేది నిజంగా నాయకుడేనా? లేక AI సిస్టమా? అన్న సందేహం తలెత్తే పరిస్థితి రావచ్చు.

Advertisement