Page Loader
Stock market: సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ..
సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ..

Stock market: సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ..

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదలికను చూపించాయి. ప్రారంభ దశలో సూచీలు బలంగా లాభాల్లో ఉన్నప్పటికీ, ట్రేడింగ్‌ మధ్యలో ఆ లాభాలను కోల్పోయాయి. ముఖ్యంగా మెటల్‌,ఔషధ రంగాల్లో అమ్మకాలు అధికమవడం సూచీలపై ఒత్తిడిని కలిగించింది. చివరికి సెన్సెక్స్‌ స్వల్ప లాభాల్లో ముగిసిన వేళ, నిఫ్టీ 24,300 పాయింట్లకు పైగా స్థిరంగా నిలిచింది. సెన్సెక్స్‌ ఈ ఉదయం 80,300.19 పాయింట్ల వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది,ఇది గత ముగింపు స్థాయి అయిన 80,242.24 కంటే కొద్దిగా ఎక్కువ. ట్రేడింగ్‌ సెషన్‌లో ఒక దశలో ఈ సూచీ 900 పాయింట్లకుపైగా పెరిగి 81,177.93 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

వివరాలు 

డాలరుతో పోల్చితే 84.50 వద్ద రూపాయి 

అయినా చివరికి 259.75 పాయింట్ల లాభంతో 80,501.99 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 12.50 పాయింట్లు పెరిగి 24,346.70 వద్ద స్థిరపడింది. మరోవైపు రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 84.50 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ సుచి‌లోని 30 కంపెనీల్లో అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో కనిపించగా, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, టైటాన్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 61 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది, బంగారం ఔన్సు ధర 3270 డాలర్ల వద్ద కొనసాగుతోంది.