
Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.
గ్లోబల్‌గా నెలకొన్న భౌగోళిక,రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా ప్రారంభంలో స్థిరంగా ప్రారంభమైన సూచీలు తర్వాత నెగటివ్ వైపుకు జారుకున్నాయి.
ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 80,204 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24,305 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌కు చెందిన 30 షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్,బజాజ్ ఫైనాన్స్,ఇండస్‌ఇండ్ బ్యాంక్,టాటా మోటార్స్,ఎస్‌బీఐ,ఎటర్నల్,టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అదే సమయంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
బంగారం ఔన్సు ధర 3,318.60 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 63.80 డాలర్ల వద్ద ఉంది.
బంగారం ఔన్సు ధర 3,318.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి.
డోజోన్స్ సూచీ 0.75 శాతం పెరగ్గా,ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.58 శాతం,నాస్‌డాక్ సూచీ 0.55 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఈ ప్రభావంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా లాభపథంలో కదలాడుతున్నాయి.ఆస్ట్రేలియాలోని ASX సూచీ 0.22 శాతం,జపాన్ నిక్కీ 0.17 శాతం లాభపడుతుండగా,చైనా షాంఘై మార్కెట్ మాత్రం 0.09 శాతం నష్టంతో ట్రేడవుతోంది.
వివరాలు
రూ.1,369 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన DIIs
విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) తిరిగి కొనుగోలుదారులుగా కనిపిస్తున్నారు.
వరుసగా పదవ ట్రేడింగ్ సెషన్ కూడా వారు కొనసాగిస్తూ, రూ.2,386 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.
ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) కూడా రూ.1,369 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.