LOADING...
Stock market: మెప్పించని ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. 197 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. 
మెప్పించని ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. 197 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్..

Stock market: మెప్పించని ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. 197 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలలో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల కారణంగా సూచీలు క్షీణించాయి. అందరూ ఊహించినట్లుగా ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ, 'తటస్థ' ధోరణిని కొనసాగించడం, బ్యాంకుల్లో లిక్విడిటీ పెంపునకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనివల్ల సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ 23,600 స్థాయికి దిగువకు చేరుకుంది. సెన్సెక్స్ ఉదయం 78,119.60 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 78,058.16) స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. .

వివరాలు 

నష్టాల్లో సెన్సెక్స్

మార్కెట్ ప్రారంభం నుంచే ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఇంట్రాడేలో సూచీ 77,475.74 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 197.97 పాయింట్ల నష్టంతో 77,860.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.40 పాయింట్ల నష్టంతో 23,559.95 వద్ద స్థిరపడింది డాలరుతో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 87.42 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, జొమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 74.93 డాలర్ల వద్ద కొనసాగగా,బంగారం ఔన్సు 2,888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.