LOADING...
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 213 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు 
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 213 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అమెరికా బాండ్ల రాబడి తగ్గడం వంటి పాజిటివ్ పరిణామాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు నష్టాల్లో ముగియడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్న వేళ, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ఈ పరిణామానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్ ఉదయం 78,513.36 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 78,271.28) లాభాల్లో ప్రారంభమైంది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 87.60

అయితే, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ, రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించింది. చివరికి 213.12 పాయింట్ల నష్టంతో 78,058.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.55 పాయింట్ల నష్టంతో 23,622.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.60గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.94 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2880 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.