Loading...
Stock market: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock market: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభనష్టాల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. చివరి గంటల్లో కోలుకుని లాభాలతో స్థిరపడ్డాయి. ఇటీవల జరిగిన ముహూర్త ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాలు నమోదు చేసిన సూచీలు.. నేడు తిరిగి పుంజుకున్నాయి. దీంతో నిఫ్టీ మరోసారి 25 వేల పాయింట్ల కీలక స్థాయిని అందుకుంది. సెన్సెక్స్‌ ఉదయం 81,327.29 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. గత సెషన్‌లో ఈ సూచీ 80,999.40 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ప్రారంభ లాభాలు ఎంతోసేపు నిలవలేదు. కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌.. రోజంతా హెచ్చుతగ్గులకు లోనైంది.

వివరాలు 

నిఫ్టీ  25 వేల మార్కు

ఇంట్రాడేలో కనిష్ఠంగా 80,519.31 పాయింట్లకు పడిపోగా.. గరిష్ఠంగా 81,339.41 పాయింట్లను తాకింది. చివరకు 107.25 పాయింట్ల లాభంతో 81,106.65 వద్ద ముగిసింది.

మరోవైపు నిఫ్టీ కూడా లాభాలతో ముగిసింది. 58.25 పాయింట్లు పెరిగి 25,044.65 వద్ద స్థిరపడింది. దీంతో కీలకమైన 25 వేల మార్కును తిరిగి దక్కించుకుంది.

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.93.93గా నమోదైంది.

వివరాలు 

చమురు ధరలు బ్యారెల్‌కు 97 డాలర్లు 

సెన్సెక్స్‌-30లోని షేర్లలో ఎస్‌బీఐ, ట్రెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభాలను నమోదు చేశాయి.

మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 97 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇదే స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ధర ఔన్సుకు 4,098 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT