Loading...
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@23,053
స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@23,053

Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@23,053

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో మార్కెట్లు లాభాల బాటలో పయనించినప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు కొంతమేర లాభాలను కోల్పోయాయి. అయినప్పటికీ చివరకు లాభాల్లోనే స్థిరపడ్డాయి. శుక్రవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 74,199 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 74,742 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కొంత వెనక్కి తగ్గింది. చివరకు 308 పాయింట్ల లాభంతో 74,466 వద్ద ముగిసింది.

వివరాలు 

నిఫ్టీ@23,053

మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 23,053 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో ట్రెంట్‌, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌, ఇన్ఫోసిస్‌, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ షేర్లు మంచి పనితీరు కనబరిచాయి.

వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు శ్రీరామ్ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, నెస్లే, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాలను చవిచూశాయి.

వివరాలు 

మార్కెట్ లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాలివే..

ఆసియా మార్కెట్లలో నష్టాలు: ఆసియా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. అమెరికా టెక్నాలజీ రంగానికి చెందిన షేర్లలో బలహీనత, ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ పరిణామాలు దేశీయ సూచీలపైనా ప్రతికూల ప్రభావం చూపించాయి.

ముడిచమురు ధరల పెరుగుదల: ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేసే అవకాశం ఉందనే ఆందోళనలు అంతర్జాతీయంగా నెలకొన్నాయి. దీంతో ముడిచమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చనే భయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 117 డాలర్లకు చేరింది. ముడిచమురు ధరల పెరుగుదల కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్ లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాలివే..

మదుపర్ల లాభాల స్వీకరణ: ఉదయం ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లోకి రావడంతో కొంతమంది మదుపర్లు తమ వాటాలను విక్రయించి లాభాలను స్వీకరించేందుకు మొగ్గు చూపారు. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIలు) కూడా భారత మార్కెట్లలో తమ వాటాల విక్రయాలను కొనసాగించారు. ఈ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఉదయం వచ్చిన లాభాల్లో కొంత భాగం తగ్గిపోయింది.

ADVERTISEMENT