
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వస్తున్న సానుకూల సంకేతాల ప్రభావం మన మార్కెట్లపై స్పష్టంగా కనపడి, సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
నిఫ్టీ కూడా 24,432 పాయింట్లపై మొదలైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్లు ఎగబాకి 80,799 వద్ద ట్రేడవుతోంది.
అదే సమయంలో, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 24,434 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ సూచీలో అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం వంటి షేర్లు లాభాలతో కదలాడుతున్నాయి.
కానీ కొటక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సెన్ వంటి షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.
వివరాలు
ప్రామాణిక సూచీలు ఈ వారం స్థిరీకరణ దశలోకి..
ప్రస్తుతం మార్కెట్లలో ఎటువంటి ముఖ్యమైన వార్తలు లేకపోవడంతో, ప్రామాణిక సూచీలు ఈ వారం స్థిరీకరణ దశలోకి అడుగు పెట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎటువంటి దారిలో సాగతాయో స్పష్టత లేకపోవడంతో, మార్కెట్లు ఒక నిర్ధిష్ట శ్రేణిలోనే కొనసాగవచ్చు అని వారు తెలిపారు.
మే 6-7 తేదీల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై మదుపర్లు విశేషమైన దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది.