Stock Market: వారాంతంలో లాభాల బాటలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 10, 2026
03:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఉత్సాహంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో నమోదైన బలమైన కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా లాభాల్లోనే ట్రేడవుతూ చివరకు భారీ గెయిన్లతో ముగిశాయి. శుక్రవారం ముగింపు సమయానికి నిఫ్టీ 248.50 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 24,211.30 వద్ద ముగిసింది. మరోవైపు సెన్సెక్స్ 820.19 పాయింట్లు లేదా 1.08 శాతం ఎగబాకి 77,569.39 వద్ద స్థిరపడింది. వారాంతంలో నమోదైన ఈ ర్యాలీతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరింత బలపడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు
#MintMarkets | Sensex jumps 800 points, Nifty 50 reclaims 24,200; investors earn ₹6 lakh crore in a day.
— Mint (@livemint) July 10, 2026
What drove the stock market? 👇https://t.co/tQnTXLZHc6