LOADING...
Stock Market : లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market : లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాయి. ప్రారంభ సెషన్‌లోనే కీలక సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 700 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 24 వేల మార్కును అధిగమించింది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 710 పాయింట్లు పెరిగి 77,452 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 24,172 స్థాయిలో కొనసాగుతోంది.

వివరాలు 

రూపాయి విలువ 95.23

విదేశీ మారకద్రవ్య మార్కెట్లో కూడా రూపాయి బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు పెరిగి 95.23 వద్ద ట్రేడవుతోంది. ఐటీ రంగానికి చెందిన హెచ్‌సీఎల్‌టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు డా. రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, సన్‌ ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాలను నమోదు చేస్తున్నాయి.

Advertisement