
Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి.
ఫలితంగా మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ట్రేడింగ్ మొత్తాన్ని అప్రమత్తంగా కొనసాగించారు.
ఈ కారణంగా సూచీలు రోజు మొత్తం తీవ్రంగా ఊగిసలాటకు లోనై, చివరకు స్వల్ప నష్టాల్లోనే ముగిశాయి.
రోజు ప్రారంభంలో సెన్సెక్స్ 80,370 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది.
ప్రారంభం తర్వాత కొద్దిసేపు లాభాలతో కొనసాగి,ఇంట్రాడేలో 80,525.61 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84.49
అయితే ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలువలేదు. లాభాల స్వీకరణ నేపథ్యంలో మదుపర్ల అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ ఒక దశలో 79,879 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
చివరికి కొంత కోలుకుని, రోజును 46.14పాయింట్ల స్వల్ప నష్టంతో 80,242.24వద్ద ముగించింది.
ఇక నిఫ్టీ సూచీ 1.75పాయింట్ల నష్టంతో 24,334.20 వద్ద స్థిరమైంది.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 47 పైసలు బలపడి 84.49వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీలో మార్కెట్‌కు మద్దతుగా మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్,భారతీ ఎయిర్‌టెల్,ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు రాణించాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్,టాటా మోటార్స్,ఎస్‌బీఐ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
రియల్టీ సూచీ 2శాతం మేర లాభపడగా,మీడియా,ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీలు 2శాతం వరకు నష్టపోయాయి.