Loading...
Stock market: ఐదో రోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 384 పాయింట్లు అప్
ఐదో రోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 384 పాయింట్లు

Stock market: ఐదో రోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 384 పాయింట్లు అప్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడం,విదేశీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలకు మద్దతుగా నిలిచాయి. ఐటీ రంగం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మెటల్‌ రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 1.55శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌ ఉదయం 76,853.11 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. గత ముగింపు 76,917.85 పాయింట్లతో పోలిస్తే దిగువన ట్రేడింగ్‌ మొదలైంది. అయితే కొద్దిసేపటికే కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వచ్చింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మధ్యాహ్నం కొంతసేపు నష్టాల్లోకి జారుకుంది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 102 డాలర్లు 

అనంతరం మళ్లీ పుంజుకుని చివరకు 383.55 పాయింట్ల లాభంతో 77,301.40 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా 86.95 పాయింట్లు పెరిగి 23,897.80 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.64గా నమోదైంది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో బీఈఎల్‌, టైటాన్‌, ఇండిగో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ ప్రధానంగా లాభాలను అందించాయి. మరోవైపు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 102 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 4,046 డాలర్ల స్థాయికి చేరింది.

ADVERTISEMENT