Loading...
Stock Market: 1,000 పాయింట్లు పడిపోయినా.. చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
1,000 పాయింట్లు పడిపోయినా.. చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

Stock Market: 1,000 పాయింట్లు పడిపోయినా.. చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అయితే, కొద్దిసేపటికే మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఐటీ, రియల్టీ షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగాయి. ఒక దశలో ఉదయం నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే దాదాపు 1,000 పాయింట్లు దిగివచ్చిన సెన్సెక్స్.. చివరి గంటల్లో కోలుకుని లాభాలను నిలబెట్టుకుంది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 772.75 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 25,200 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

వివరాలు 

బుల్‌ జోరుకు మధ్యలోనే బ్రేక్‌..

మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 81,106.65 పాయింట్ల వద్ద ఉంది.

బుధవారం ఉదయం దాదాపు 1,100 పాయింట్ల లాభంతో 82,248.68 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

కొనుగోళ్ల జోరుతో ఒక దశలో 82,520 పాయింట్లకు చేరింది. దీంతో గత ఎనిమిది నెలల్లోనే అత్యధిక స్థాయిని నమోదు చేసింది.

అయితే, ఈ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చారు.

దీంతో మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఐటీ, రియల్టీ రంగాల షేర్లలో విక్రయాలు అధికమవడంతో సెన్సెక్స్‌ క్రమంగా దిగివచ్చింది.

ఇంట్రాడేలో 81,417 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఉదయం నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే దాదాపు 1,000 పాయింట్లు పడిపోయింది.

వివరాలు 

బుల్‌ జోరుకు మధ్యలోనే బ్రేక్‌..

అయితే, చివరి సెషన్‌లో కొనుగోళ్లు తిరిగి పుంజుకోవడంతో సూచీలు కోలుకున్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 772.75 పాయింట్ల లాభంతో 81,879 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 25,255 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 93.69 వద్ద స్థిరపడింది.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్ల ర్యాలీకి కారణాలివే..

ముడి చమురు ధరల తగ్గుదల: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో ముడి చమురు ధరలు దిగివచ్చాయి. మంగళవారం ట్రేడింగ్‌లో బ్యారెల్‌ చమురు ధర 90 డాలర్ల దిగువకు చేరి మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర స్వల్పంగా పెరిగి 92 డాలర్లకు చేరినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం కొనసాగింది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లకు మద్దతుగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్ల ర్యాలీకి కారణాలివే..

విదేశీ మదుపర్ల కొనుగోళ్లు: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే విదేశీ మదుపర్లు రూ.7,212 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. నవంబరు 2 నుంచి 9వ తేదీ మధ్య విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు రూ.53,739 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కొనుగోళ్లు మార్కెట్లలో ఉత్సాహాన్ని పెంచాయి.

వివరాలు 

మార్కెట్ల ర్యాలీకి కారణాలివే..

కంపెనీల మెరుగైన ఫలితాలు: పలు కంపెనీలు రెండో త్రైమాసికంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఈ పరిణామం కూడా మదుపర్లలో విశ్వాసాన్ని పెంచింది. కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిచ్చి సూచీల ర్యాలీకి తోడ్పడింది.

ADVERTISEMENT