Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేశాయి.
అమెరికాలో ఆర్థిక వృద్ధి మందగమనం కారణంగా మాంద్యం వచ్చే ప్రమాదం ఉందనే భయాలతో దేశీయ ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలకు కొంత మద్దతునిచ్చాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ యాజమాన్యం మదుపర్ల నమ్మకాన్ని పెంచే ప్రకటనలు చేయడంతో నిన్న భారీగా పతనమైన బ్యాంక్ షేర్లు ఇవాళ 5 శాతం మేర లాభపడ్డాయి.
వివరాలు
సెన్సెక్స్ & నిఫ్టీ పరిస్థితి
సెన్సెక్స్ ఉదయం 74,270.81 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 74,102.32) లాభాల్లో ప్రారంభమైంది.
అయితే, కొన్ని క్షణాల్లోనే నష్టాల్లోకి వెళ్లి స్వల్పంగా కోలుకుంది.
ఇంట్రాడేలో 73,598.16 - 74,392.15 పాయింట్ల మధ్య మారుతూ చివరకు 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగిసింది.
నిఫ్టీ 27.40 పాయింట్లు కోల్పోయి 22,470.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.21గా ఉంది.
వివరాలు
స్టాక్స్ లాభనష్టాలు:
సెన్సెక్స్ 30 సూచీల్లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.23 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,922 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.