Loading...
Stock Market: మార్కెట్లకు చమురు జోష్‌.. 1,100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
మార్కెట్లకు చమురు జోష్‌.. 1,100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Stock Market: మార్కెట్లకు చమురు జోష్‌.. 1,100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల సెగ తగ్గడంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపించింది. దీంతో ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 9.30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,122 పాయింట్లు పెరిగి 82,228 వద్ద కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 294 పాయింట్లు లాభపడి 25,339 వద్ద ట్రేడయింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా మెరుగుపడింది. 7 పైసలు బలపడి 93.70 వద్ద కొనసాగింది.

వివరాలు 

ఆసియా మార్కెట్లలో సానుకూల వాతావరణం

నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాలతో దూసుకెళ్లాయి.

మరోవైపు హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఆసియా మార్కెట్లలో సానుకూల వాతావరణం దేశీయ సూచీలకు మద్దతుగా నిలిచాయి.

ADVERTISEMENT