Loading...
Stock Market: సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా జంప్‌.. మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే!
సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా జంప్‌.. మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే!

Stock Market: సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా జంప్‌.. మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కొనుగోళ్ల జోరు పెరగడంతో ప్రధాన సూచీలు భారీగా పుంజుకున్నాయి. ఒక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభపడి 84,498.21 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా పెరిగి 25,900 మార్కును అందుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు ప్రధాన బలాన్నిచ్చాయి. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,339.08 పాయింట్ల లాభంతో 83,775.07 వద్ద కొనసాగింది.

వివరాలు 

మార్కెట్‌ భారీ ర్యాలీకి కారణాలివే..

నిఫ్టీ 383 పాయింట్లు పెరిగి 25,733.20 వద్ద ట్రేడయింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉండగా.. మిగిలిన కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగాయి.

లార్జ్‌క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు

అధిక వెయిటేజీ కలిగిన లార్జ్‌క్యాప్‌ కంపెనీల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడం మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండిగో వంటి ప్రముఖ కంపెనీల షేర్లు సుమారు 4 శాతం వరకు పెరిగాయి.

ఈ స్టాక్స్‌లో వచ్చిన లాభాలు ప్రధాన సూచీలను మరింత పైకి తీసుకెళ్లాయి.

వివరాలు 

ఏఐ షేర్ల నుంచి పెట్టుబడులు ఇతర మార్కెట్లకు..

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ రాకతో గతంలో టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్లు పెరిగినప్పటికీ.. తాజాగా ఈ రంగంలో మళ్లీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

గత ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికా నాస్‌డాక్‌ సూచీ 1.5 శాతం పడిపోయింది.

ఎన్విడియా షేరు 6 శాతం క్షీణించగా.. ఏఎండీ, మైక్రాన్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగానికి చెందిన కంపెనీల షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి.

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌, ఎస్‌కే హైనిక్స్‌ షేర్లు సైతం 9శాతం మేర పడిపోయాయి.

డేటా సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ.. వాటి నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తుందా? అనే సందేహాలు మదుపర్లలో పెరుగుతున్నాయి.

దీంతో ఏఐ ఆధారిత కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ షేర్ల నుంచి పెట్టుబడులు ఇతర మార్కెట్లకు..

ఈ పరిస్థితుల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) అమెరికా టెక్నాలజీ షేర్ల నుంచి పెట్టుబడులను మళ్లించి భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు

విదేశీ సంస్థాగత మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

ఈ ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో 13.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

సోమవారం ఒక్కరోజే రూ.5,673 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల జోరుకు కారణమైంది.

వివరాలు 

రూపాయి బలోపేతం.. ముడిచమురు ధరలు

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా బలపడింది.

ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి 56 పైసలు పుంజుకుని డాలర్‌తో పోలిస్తే రూ.92.29 వద్ద కొనసాగింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయి వద్ద ఉంది.

రూపాయి బలోపేతం కావడం, ముడిచమురు ధరలు ఆ స్థాయిలో కొనసాగడం కూడా భారత మార్కెట్లకు సానుకూల అంశాలుగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పరిణామాలన్నీ కలిసి దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT