తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Stock Market: నేడు ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ మార్కెట్ సూచీలు
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    May 06, 2025 
                    
                     09:54 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప మార్పులతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సూచనల నేపథ్యంలో,తొలుత లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కొంత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 80,729 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ సూచీ 19 పాయింట్లు తగ్గి 24,442 వద్ద కొనసాగుతోంది. విదేశీ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఐదు పైసలు తగ్గి 84.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీలో భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభదాయకంగా కదలాడుతున్నాయి. అదే సమయంలో, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.