Loading...
AC-TV price hikes: పండగ సీజన్‌ వేళ షాక్‌.. ఏసీ, టీవీలు సహా గృహోపకరణాల ధరల పెంపు
పండగ సీజన్‌ వేళ షాక్‌.. ఏసీ, టీవీలు సహా గృహోపకరణాల ధరల పెంపు

AC-TV price hikes: పండగ సీజన్‌ వేళ షాక్‌.. ఏసీ, టీవీలు సహా గృహోపకరణాల ధరల పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండగ సీజన్‌కు ముందు వినియోగదారులకు ప్రముఖ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. ఎయిర్‌ కండీషనర్లు (AC), ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు సహా పలు గృహోపకరణాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఉత్పత్తుల ధరలను 5-8 శాతం మేర సవరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. కొత్త ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా రాగి, స్టీల్‌, క్రూడాయిల్‌ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, అదే సమయంలో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం ధరల పెంపునకు ప్రధాన కారణాలని కంపెనీలు తెలిపాయి. ఎయిర్‌ కండీషనర్ల ధరలను 5-8 శాతం మేర పెంచినట్లు ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్స్‌ తెలిపారు.

వివరాలు

బ్లూ స్టార్‌: ఈ ఏడాది మూడోసారి ధరల పెంపు

వాషింగ్‌ మెషిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 3-4 శాతం వరకు పెరిగాయి. అయితే మరికొన్ని కంపెనీలు ఈ ధరల పెంపు తాత్కాలికమేనని చెబుతున్నాయి.

ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలను 5-8 శాతం మేర పెంచినట్లు బ్లూ స్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్యాగరాజన్‌ తెలిపారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. కాపర్‌, ప్లాస్టిక్‌, స్టీల్‌ ధరలు భారీగా పెరిగాయని చెప్పారు.

గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈసారి దాదాపు 15 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపారు. కాగా.. ఈ ఏడాది బ్లూ స్టార్‌ ఉత్పత్తుల ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

వివరాలు

గోద్రెజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌: 5-7 శాతం పెంపు

ముడిసరుకు ధరలు 8-10 శాతం మేర పెరిగాయని గోద్రెజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ బిజినెస్‌ విభాగానికి చెందిన కమల్‌ నంది తెలిపారు.

ఈ నేపథ్యంలో అన్ని క్యాటగిరీల ఉత్పత్తులపై దాదాపు 5-7 శాతం వరకు ధరలు పెంచినట్లు వెల్లడించారు.

ఈ ధరల పెంపు అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు దశల వారీగా అమల్లోకి వస్తుందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

హైయర్‌ ఇండియా: వచ్చే ఏడాది కూడా భారం తప్పదా?

ముడిసరకుల ధరలు ఇదే విధంగా పెరుగుతూ ఉంటే వచ్చే ఏడాది కూడా ఆ భారాన్ని వినియోగదారులే భరించాల్సి వస్తుందని హైయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎన్ఎస్‌ సతీష్‌ అన్నారు.

ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, ఇతర ఉత్పత్తులపై 2-3 శాతం వరకు ధరలు పెంచినట్లు తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి వరకు తమ ఉత్పత్తుల ధరలను దశల వారీగా 15 శాతం వరకు పెంచుతామని ఆయన వెల్లడించారు

ADVERTISEMENT

వివరాలు

డైకిన్‌: కాపర్‌ డిమాండ్‌ కారణంగానే..

కాపర్‌కు పెరిగిన డిమాండ్‌ కారణంగానే తమ ఉత్పత్తుల ధరలను 8-10 శాతం మేర పెంచినట్లు డైకిన్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా సీఎండీ కన్వల్జీత్‌ జావా తెలిపారు.

పండుగ సీజన్‌కు ముందు ధరల పెంపును ప్రకటించినప్పటికీ.. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద పాత ధరలకే కొనుగోలు చేసిన స్టాక్‌ ఇంకా ఉందని కంపెనీలు తెలిపాయి.

దీంతో దీపావళి వరకు కొన్ని ఉత్పత్తులు వినియోగదారులకు పాత ధరలకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం ధరల పెంపు పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.

అంటే.. కొత్త ధరలకు ముందు పాత స్టాక్‌ విక్రయాలు పూర్తయ్యే అవకాశం ఉండటంతో కొన్ని ఉత్పత్తులను వినియోగదారులు దీపావళి వరకు పాత ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT