డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు
ఫిబ్రవరి 1 నుంచి డీటీహెచ్, కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాల మేరకు ప్రముఖ బ్రాడ్ కాస్టర్లు తమ టీవీ ఛానళ్ల ధరలను భారీగా పెంచనున్నాయి. 30శాతం టారిఫ్ పెరగనుండటంతో టీవీ ఛానళ్లు మరింత ప్రియం కానున్నాయి. బ్రాడ్ కాస్టర్లు ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం పే టీవీ ఇండస్ట్రీపై పడే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో చందాదారులను తగ్గిపోయే అవకాశం ఉందని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.
కొత్త టారిఫ్ ఆర్డర్‌ను నవంబర్‌లోనే సవరించిన ట్రాయ్
ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్‌ను నవంబర్‌లో సవరించింది. ఇందులో భాగంగా ఒక టీవీ ఛానెల్ ధరను రూ.12 నుంచి రూ.19 పెంచింది. ప్రసారకర్తలు గరిష్టంగా 45% డిస్కౌంట్‌ను కూడా వినియోగదారులకు అందించవచ్చని ట్రాయ్ చెప్పింది. అయితే ప్రస్తుతానికి అయితే ఏ ఛానెల్ కూడా డిస్కౌంట్ అందించాడానికి ఆసక్తి చూపడం లేదు. పెంచిన ధరలను అమలు చేయాలని సిద్ధమవుతున్నాయి. అయితే డీడీ డిష్, ఓటీటీ ప్లేయర్‌ల కారణంగా నిరంతరం సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల పరిస్థితి గురించి తమకు తెలుసనని ట్రాయ్ ఈ సందర్భంగా పేర్కొంది.