Anthropic: షాకిచ్చిన ఆంత్రోపిక్.. సైబర్ స్టాక్స్ 10 బిలియన్ డాలర్ల నష్టం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఆధారిత AI స్టార్టప్ ఆంత్రోపిక్ తాజాగా వరుస సంచలనాలను సృష్టిస్తోంది. కొన్ని గంటల క్రితం సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పోస్టు కారణంగా సైబర్ సెక్యూరిటీ రంగంలోని షేర్లు కుప్పకూలాయి, అమెరికా మార్కెట్‌లో అనేక కంపెనీల స్టాక్స్ భారీగా పతనం చెందాయి. ఆంథ్రోపిక్ తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్ 'క్లాడ్ కోడ్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది డెవలపర్ల సాఫ్ట్‌వేర్ కోడ్‌బేస్‌లను స్కాన్ చేసి లోపాలను గుర్తిస్తుంది, వాటిని పరిష్కరించే సిఫార్సులను అందిస్తుంది. ఫలితంగా కోడింగ్ ప్రాసెస్‌లోనే భద్రతాపరమైన లోపాలను గుర్తించి, సరిదిద్దడం సులభం అవుతుంది.
Details
బల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ETF 5% మేర పతనం
సంప్రదాయ పద్ధతుల్లో కనిపించని లోపాలను కూడా ఈ టూల్ గుర్తించగలదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ AI ఆధారిత ఫీచర్ పరిశీలన దశలో ఉంది. ఈ వార్తకు ప్రతిక్రియగా సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు - క్రౌడ్‌స్ట్రైక్, క్లౌడ్‌ఫ్లేర్, స్కేలార్, సెయిల్ పాయింట్, ఓక్టా- 5% నుంచి 9% మేర పడిపోయాయి. సైబర్ సెక్యూరిటీ సంబంధిత సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లలో గిట్‌ల్యాబ్, జెఫ్రాగ్ కూడా పతనం చెందాయి. అంతేకాక గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ETF 5% మేర తగ్గింది. మొత్తం మార్కెట్‌లో మదుపర్ల సంపద సుమారు 10 బిలియన్ డాలర్ల మేర తగ్గినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.