New Packaging Rules: సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల ప్యాకెట్లపై కొత్త మార్కింగ్.. పూర్తి వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులు సహా పలు కాస్మెటిక్స్, టాయిలెట్రీ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై వెజిటేరియన్, నాన్‌వెజిటేరియన్ గుర్తులను చూపించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉత్పత్తి వెజిటేరియన్ పదార్థాలతో తయారైందా, నాన్‌వెజిటేరియన్ పదార్థాలతో తయారైందా అనేది వినియోగదారులు ప్యాకెట్‌పైనే సులభంగా గుర్తించేలా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. వెజిటేరియన్ మూలానికి చెందిన ఉత్పత్తులకు ఆకుపచ్చ రంగు చుక్క (గ్రీన్ డాట్)ను ముద్రించాలి. నాన్‌వెజిటేరియన్ మూలానికి చెందిన ఉత్పత్తులకు ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క (రెడ్ లేదా బ్రౌన్ డాట్) ఉండాలి. ఈ గుర్తును ప్యాకెట్‌లోని ప్రధాన ప్రదర్శన భాగం (Principal Display Panel) పైభాగంలో ఉంచాల్సి ఉంటుంది.
వివరాలు
ప్యాకెట్‌పై రంగు గుర్తుతో ఉత్పత్తి వెజిటేరియన్‌దా.. నాన్‌వెజిటేరియన్‌దా తెలుసుకోవచ్చు
అంటే ప్యాకెట్‌పై ఉన్న రంగు గుర్తును బట్టి ఆ ఉత్పత్తి వెజ్‌నా.. నాన్‌వెజ్‌నా అనేది ఇకపై సులభంగా తెలుసుకోవచ్చు.
వినియోగదారులు ఉత్పత్తి ఎంపిక చేసుకునే సమయంలో మరింత స్పష్టమైన సమాచారం అందించడమే ఈ మార్కింగ్ ఉద్దేశం.
ఈ నిబంధనలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ Legal Metrology (Packaged Commodities) Rules, 2011లో భాగంగా అమలు చేస్తోంది.