LOADING...
Central Government: మహిళల కోసం ప్రత్యేక పథకం.. ట్రైనింగ్‌తో పాటు నెలకు రూ. 7 వేలు
మహిళల కోసం ప్రత్యేక పథకం.. ట్రైనింగ్‌తో పాటు నెలకు రూ. 7 వేలు

Central Government: మహిళల కోసం ప్రత్యేక పథకం.. ట్రైనింగ్‌తో పాటు నెలకు రూ. 7 వేలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మహిళలకు ప్రత్యేక శుభవార్త అందించింది. ఆర్ధికంగా స్వావలంబన సాధించాలనుకునే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో 'బీమా సఖీ యోజన' అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే LIC ఏజెంట్‌గా చేరే అవకాశం ఉంటుంది. పథకంలో భాగంగా కొత్తగా చేరే మహిళలకు మూడేళ్ల పాటు స్ట్రైఫండ్‌తో కూడిన ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వారు సాధారణ LIC ఏజెంట్‌గా పనిచేయవచ్చు.

Details

అర్హతలు 

వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి కనీసం పదో తరగతి ఉత్తీర్హత ఉండాలి మూడేళ్ల ట్రైనింగ్ సమయంలో నెలకు స్ట్రైఫండ్ తొలి ఏడాది: రూ.7,000 రెండో ఏడాది: రూ.6,000 మూడో ఏడాది: రూ.5,000 డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు LIC డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశం కమిషన్ పాలసీల ఆధారంగా కమిషన్ అందుతుంది మొదటి 4 నెలల్లో: నెలకు రూ.2,000 వరకు తదుపరి 4 నెలల్లో: నెలకు రూ.4,000 వరకు చివరి 4 నెలల్లో: నెలకు రూ.6,000 వార్షికంగా అత్యధికంగా రూ.48,000 వరకు కమిషన్

Details

నిబంధనలు 

ఇప్పటికే LIC ఏజెంట్‌గా ఉన్న మహిళలు అర్హత పొందలేరు కొత్తగా ఏజెంట్‌గా చేరాలనుకునే మహిళలకు మాత్రమే పథకం వర్తిస్తుంది ఏజెంట్‌ల బంధువులు, మాజీ LIC ఏజెంట్లు కూడా అర్హులుగా ఉండరాదు అప్లికేషన్ విధానం మహిళలు LIC అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి వయస్సు, విద్యార్హత, అడ్రస్ వంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి LIC అధికారులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత మహిళలకు ఏజెంట్‌గా అవకాశం ఇస్తారు గతంలో మహిళలు ఏజెంట్‌గా చేరినప్పుడు కమిషన్ బేస్డ్ ఇన్‌సెంటివ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఈ పథకం ద్వారా మహిళలకు నెలనెలా స్ట్రైఫండ్‌తో పాటు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. బీమా రంగంలోకి రావాలనే మహిళలకు ఇది చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Advertisement