Stock Market: నేడు లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
వాణిజ్య యుద్ధ భయాలతో వరుసగా నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు, నేడు కనిష్ఠ స్థాయిలో మదుపర్లు కొనుగోలు చేయడంతో లాభదిశగా సాగాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్ ప్రారంభంలో నిఫ్టీ (Nifty) 23,100 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించగా, సెన్సెక్స్ (Sensex) 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు పెరిగి 76,201 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 23,030 వద్ద ట్రేడవుతున్నాయి.
వివరాలు
రూపాయి మారకం విలువ 86.85
సెన్సెక్స్ 30లోని ప్రధాన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్ లాభాల్లో ట్రేడవుతుండగా, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, జొమాటో, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అల్ట్రా టెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో కదులుతున్నాయి.
రూపాయి మారకం విలువ డాలర్‌తో 86.85 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.16 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,957.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
స్థిరంగా జపాన్ నిక్కీ సూచీలు
అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి.
ఎస్ అండ్ పీ 500, డోజోన్స్, నాస్‌డాక్ సూచీలు 1 శాతం మేర లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్, జపాన్ నిక్కీ సూచీలు స్థిరంగా ఉండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 2.17 శాతం లాభంతో ట్రేడవుతోంది.
దేశీయంగా, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) విక్రయాలు కొనసాగిస్తుండగా, గురువారం నికరంగా రూ.2,790 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,935 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.