Page Loader
Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు
న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు

Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2025 నూతన సంవత్సరాన్ని ఫ్లాట్‌గా స్వాగతించాయి. మొదటి రోజు తీవ్ర ఊగిసలాటకు లోనవుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 78,070 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 26 పాయింట్లు కుంగి 23,618 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, జొమాటో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

నష్టాల్లో అమెరికా మార్కెట్లు 

కానీ, అల్ట్రా టెక్ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ.78.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.ప్రధాన సూచీలు అయిన ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ 1 శాతం మేర నష్టాలు చవిచూసాయి.

వివరాలు 

నేడు మిశ్రమంగా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు 

ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి,అయితే హాంకాంగ్ హాంగ్‌సెంగ్ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) అమ్మకాల పర్వం కొనసాగిస్తూ, మంగళవారం నికరంగా రూ.4,645 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. కాగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,547 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.