Loading...
Stock Market: సెన్సెక్స్‌ 905 పాయింట్లు జంప్‌.. రూ.5 లక్షల కోట్ల సంపద పెరుగుదల
సెన్సెక్స్‌ 905 పాయింట్లు జంప్‌.. రూ.5 లక్షల కోట్ల సంపద పెరుగుదల

Stock Market: సెన్సెక్స్‌ 905 పాయింట్లు జంప్‌.. రూ.5 లక్షల కోట్ల సంపద పెరుగుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపడం మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 905 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,900 పాయింట్లకు చేరువలో ముగిసింది. మరోవైపు బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే దాదాపు రూ.5 లక్షల కోట్లు పెరిగి రూ.477 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు 

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.25గా నమోదు 

సెన్సెక్స్‌ ఉదయం 73,268.47 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

గత సెషన్‌లో ఈ సూచీ 73,246.03 పాయింట్ల వద్ద ముగిసింది.ప్రారంభం నుంచి రోజంతా లాభాల్లోనే కదలాడిన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో 74,166.16 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

చివరకు 905.01 పాయింట్ల లాభంతో 74,151.04 వద్ద స్థిరపడింది.

మరోవైపు నిఫ్టీ 184.05 పాయింట్లు పెరిగి 22,882.90 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.25గా నమోదైంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ట్రెంట్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మినహా మిగిలిన కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి.

అదానీ పోర్ట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌,ఎటర్నల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లలో ప్రధానంగా కొనుగోళ్లు కనిపించాయి.

వివరాలు 

మార్కెట్ల ర్యాలీకి కారణాలివే..

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా దాదాపు 3.9 శాతం వద్దే కొనసాగించింది.

ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. వడ్డీ రేట్ల విషయంలో స్థిరత్వం ఉండటంతో మార్కెట్లలో కొనుగోళ్లకు మద్దతు లభించింది.

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ), సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మదుపర్లలో ఉత్సాహాన్ని పెంచాయి.

రానున్న రోజుల్లో ఈ పన్నుల విషయంలో ఊరట లభించవచ్చన్న ఆశలతో కొనుగోళ్లు పెరిగాయి.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్ల ర్యాలీకి కారణాలివే..

ఇటీవల వరుసగా అమ్మకాలు జరిపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారడం మార్కెట్లకు కలిసొచ్చింది.

బుధవారం వీరు దాదాపు రూ.872 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. దీంతో సూచీలకు మరింత బలం చేకూరింది.

అమెరికా పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడులు కీలకమైన 5 శాతం స్థాయి దిగువకు చేరడం కూడా దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది.

దీనికితోడు ఇటీవలి మార్కెట్‌ దిద్దుబాటు తర్వాత షేర్ల విలువలు ఆకర్షణీయంగా కనిపించడంతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.

ఈ పరిణామాలన్నీ కలిసి దేశీయ స్టాక్‌ మార్కెట్లలో భారీ ర్యాలీకి దోహదపడ్డాయి.

ADVERTISEMENT