Stock Market : లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్‌కు మద్దతు లభించింది.
ఫలితంగా, మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 22,400 మార్క్‌కు పైగా ప్రారంభమైంది.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 73,807 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 22,366 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్,టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం,జొమాటో,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,యాక్సిస్ బ్యాంక్,హెచ్‌యూఎల్ వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 69.69 డాలర్లు
అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 69.69 డాలర్ల వద్ద ఉంది.
బంగారం ఔన్సు ధర 2,931.80 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.90 వద్ద కొనసాగుతోంది.
అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి.
వివరాలు
DIIs నికరంగా రూ.3,371 కోట్ల షేర్లు కొనుగోలు
డోజోన్స్ 1.14 శాతం, ఎస్‌అండ్‌పీ సూచీ 1.12 శాతం, నాస్‌డాక్ 1.46 శాతం పెరిగి ముగిసాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా ఈ ధోరణినే అనుసరిస్తున్నాయి.
ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్, జపాన్ నిక్కీ స్థిరంగా ట్రేడవుతుండగా, షాంఘై, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1 శాతం మేర లాభంతో కొనసాగుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.2,895 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,371 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.