Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,000
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.
మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, నిఫ్టీ 23,000 మార్క్ పై ట్రేడింగ్ ప్రారంభించింది.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 137 పాయింట్లు కుదిలించి 76,269 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 23,105 వద్ద కొనసాగింది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, ఎల్ అండ్‌టీ, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, జొమాటో, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలు నమోదుచేస్తున్నాయి.
వివరాలు
లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ఔన్సు 2,760 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి.
ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు ఈ రోజు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ.4,026 కోట్ల విలువైన వాటాలను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,640 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.