Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న బలహీన సంకేతాలతో సూచీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో, మంగళవారం సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 360 పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది, కాగా నిఫ్టీ 23,500 పాయింట్ల పైగా కదలాడింది.
ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,818 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 23,539 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
బంగారం ఔన్సు ధర 2,619.40 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, జొమాటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మరోవైపు, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బంగారం ఔన్సు ధర 2,619.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.61 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలు ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ 1 శాతం మేర నష్టాల్లో ముగిశాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగుతోంది.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ అమ్మకాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు, సోమవారం కూడా రూ.1,893 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,174 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.