
Stock Market: సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 150 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో మార్కెట్ బలంగా నిలిచింది.
ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 81,517 స్థాయిలో కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 24,696 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్-30 సూచీలో టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.18డాలర్లు
మరోవైపు,టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా,ఇండస్‌ఇండ్ బ్యాంక్,అదానీ పోర్ట్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.18డాలర్ల వద్ద ఉండగా,బంగారం ధర ఔన్సు దాదాపు 3,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే,నాస్‌డాక్,ఎస్ అండ్ పీ 500 సూచీలు నిన్నటివరకు లాభాల్లో ముగిశాయి.
అయితే డోజోన్స్ సూచీ మాత్రం స్థిరంగా ముగిసింది.ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.
ఆస్ట్రేలియన్ ASX సూచీ 0.11 శాతం నష్టాన్ని చూపిస్తుండగా,జపాన్ నిక్కీ సూచీ 0.81 శాతం నష్టపోయింది.
మరోవైపు, షాంఘై మార్కెట్ 1.42 శాతం లాభపడగా,హాంకాంగ్‌లోని హాంగ్‌సెంగ్ సూచీ 0.21 శాతం లాభంలో ఉంది.
వివరాలు
రూ.477 కోట్ల విలువైన షేర్ల విక్రయం
విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) మళ్లీ అమ్మకాల వైపుకు మొగ్గు చూపారు.
మంగళవారం వారు నికరంగా రూ.477 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
అంతకుమేపుగా దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) భారీగా కొనుగోళ్లు చేసి, నికరంగా రూ.4,274 కోట్ల విలువైన షేర్లను సేకరించారు.