Loading...
Stock market: దుమ్మురేపిన దేశీయ మార్కెట్లు.. 950 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ జంప్!
స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. 950 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌, 24,300 దాటిన నిఫ్టీ!

Stock market: దుమ్మురేపిన దేశీయ మార్కెట్లు.. 950 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ జంప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం ఉత్సాహంగా ముగిసింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లలో పెట్టుబడిదారుల కొనుగోళ్ల మద్దతు మార్కెట్‌కు బలాన్నిచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 950కుపైగా పాయింట్లు ఎగిసిపడగా, నిఫ్టీ 24,300 మార్క్‌ పైన ముగిసింది. ఉదయం 77,370.77 పాయింట్ల వద్ద (గత ముగింపు 77,186.87) ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రోజంతా లాభాల బాటలోనే కొనసాగింది. ట్రేడింగ్‌ సమయంలో 78,282.55 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ, చివరకు 964.58 పాయింట్లు పెరిగి 78,151.45 వద్ద ముగిసింది.

వివరాలు

నష్టాల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండిగో షేర్లు

మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 261.55 పాయింట్లు లాభపడి 24,334.30 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.28గా నమోదైంది.

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి.

మరోవైపు సన్‌ ఫార్మా, ట్రెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండిగో షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 85.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే బంగారం ధర ఔన్సుకు 3,996 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT