Page Loader
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,500 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ 
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,500 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నుండి వచ్చిన ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ ప్రభావంతో ట్రేడింగ్‌ సెషన్‌ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 24,500 పాయింట్ల కంటే దిగువన ట్రేడవుతోంది. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 456 పాయింట్లు తగ్గి 80,858 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 24,423 వద్ద కొనసాగింది.

వివరాలు 

 బంగారం ఔన్సు 2,711.70 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 సూచీల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి షేర్లు నష్టాల్లో ఉండగా, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73.39 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,711.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.86 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగియగా, ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా అదే దిశలో కదలాడుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.61 శాతం, జపాన్‌ నిక్కీ 1.23 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.48 శాతం, షాంఘై 1.43 శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.3,560 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,647 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.