Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 555 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత కుదేలయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 555.23 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయి 75,577.58 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 144.05 పాయింట్లు (0.61 శాతం) కోల్పోయి 23,635.10 వద్ద ముగిసింది.
వివరాలు
నష్టాల్లో డీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్,
ఇక షేర్ల విషయానికి వస్తే.. జీఈ వెర్నోవా టి&డి ఇండియా లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా) లిమిటెడ్, పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ తదితర కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి.
మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం స్వల్పంగా లాభాల్లో ముగిశాయి.