Loading...
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మదుపర్లలో ఆందోళన
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మదుపర్లలో ఆందోళన

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మదుపర్లలో ఆందోళన

వ్రాసిన వారు Moogati Shabari
Jul 16, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగి ప్రాంతీయ యుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళన ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు స్వల్ప మార్పులతో ఫ్లాట్‌గా ముగిశాయి. చివరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.44 పాయింట్లు లాభపడి 77,186.87 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5.75 పాయింట్లు నష్టపోయింది.

వివరాలు

లాభాల్లో నిలిచిన కంపెనీలు ఇవే..

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండిగో, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి.

మరోవైపు ఎటర్నల్‌, బీఈఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ట్రెంట్‌ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96.34 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 84.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

బంగారం ఔన్స్‌ ధర 4,033 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్‌ నిక్కీ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి.

ADVERTISEMENT