తదుపరి వార్తా కథనం
Stock Market: వరుసగా 10వ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 04, 2025
03:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతోనే ముగిసింది.
ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొంది.
దీంతో గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలను ఎదుర్కొంటూ వస్తోంది.
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి.
చివరికి, సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టపోయి 72,989 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 36 పాయింట్లు తగ్గి 22,082 వద్ద ముగిసింది.
ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 9 పైసలు పెరిగి 87.27 వద్ద స్థిరపడింది.