LOADING...
Stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. దూసుకెళ్తున్న నిఫ్టీ, సెన్సెక్స్
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. దూసుకెళ్తున్న నిఫ్టీ, సెన్సెక్స్

Stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. దూసుకెళ్తున్న నిఫ్టీ, సెన్సెక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్ ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.18 గంటల సమయంలో నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 24,790 వద్ద, సెన్సెక్స్‌ 213 పాయింట్లు ఎగసి 81,332 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రత్యేకంగా సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కల్పతరు ప్రాజెక్ట్స్‌, మహారాష్ట్ర స్కూటర్స్‌, ఎఫ్‌డీసీ లాభాల్లో ఉండగా, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, జూబిలియంట్‌ ఇన్‌గ్రేవియా, జీటీఎల్‌ ఇన్ఫ్రా, కేపీఆర్‌ మిల్‌ వంటి స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల విషయానికి వస్తే ఆటో మొబైల్‌ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు సానుకూలంగా కదలికను నమోదు చేస్తున్నాయి.

Details

నష్టాల్లో తైవాన్‌, హాంకాంగ్‌ మార్కెట్లు

దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉండటం, అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లలో కోత విధించవచ్చన్న అంచనాల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లలో ధీమా నెలకొంది. మరోవైపు, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలహీనమై రూ.86.18 వద్ద ట్రేడవుతోంది. ఆసియా-పసిఫిక్ మార్కెట్ల దృష్టిలో చూస్తే.. చైనా షాంఘై, జపాన్‌ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 200 సూచీలు లాభాల్లో కొనసాగుతుండగా.. తైవాన్‌, హాంకాంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.