Stock market: వరుసగా నాలుగో రోజూ మార్కెట్ల ర్యాలీ.. 23,800 దాటిన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు కావచ్చన్న అంచనాలు మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మంగళవారం సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ 23,800 పాయింట్ల మైలురాయిని దాటింది.
వివరాలు
నిఫ్టీ @ 23,810
సెన్సెక్స్ క్రితం ముగింపు 75,692.78 పాయింట్లు కాగా.. మంగళవారం ఉదయం 76,288.65 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.
రోజంతా అదే జోరును కొనసాగించిన సూచీ.. ఇంట్రాడే గరిష్ఠాల వద్ద 1,225.07 పాయింట్లు పెరిగి 76,917.85 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 370.05 పాయింట్లు లాభపడి 23,810.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ట్రెంట్ షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి.
ముఖ్యంగా హిందుస్థాన్ యునిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మంచి లాభాలను అందించాయి.
వివరాలు
మార్కెట్లకు కలిసొచ్చిన అంశాలివే..
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105.56 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 3,906.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఎల్‌టీసీజీ పన్ను రద్దుపై అంచనాలు: దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు భారత మ్యూచువల్ ఫండ్లకు ఊరట కల్పించే ఉద్దేశంతో ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడంతో విదేశీ మదుపర్లలో ఉత్సాహం పెరిగింది.
వివరాలు
మార్కెట్లకు కలిసొచ్చిన అంశాలివే..
ముడిచమురు ధరలు తగ్గడం: అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే ధర కొంత పెరిగినప్పటికీ.. ఇటీవల నమోదైన రికార్డు స్థాయి ధరలతో పోలిస్తే తగ్గడం దేశీయ మార్కెట్లకు ఊరటనిచ్చింది.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే వారు రూ.3,115 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికితోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం, కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటం మార్కెట్ సూచీలకు మరింత బలాన్నిచ్చాయి.