LOADING...
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా పడిపోయిన సూచీలు, రోజు చివరికి బలంగా కోలుకుని గ్రీన్‌లో నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడడం,పలు రంగాల్లో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ముఖ్యంగా ఇంట్రాడేలో 1,526 పాయింట్ల భారీ పతనాన్ని ఎదుర్కొన్న సెన్సెక్స్ తిరిగి లాభాల్లోకి రావడం గమనించదగ్గ విషయం. ఉదయం సెన్సెక్స్ 72,262.05 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 73,134.32) నష్టాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో 71,545.81 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత క్రమంగా కోలుకుని, చివరికి 185.23 పాయింట్లు పెరిగి 73,319 వద్ద ముగిసింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లు 

అదే విధంగా నిఫ్టీ 33.70 పాయింట్ల లాభంతో 22,713 స్థాయిలో నిలిచింది. విదేశీ మారకంలో రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 157 పైసలు పెరిగి 93.13 వద్ద నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,616 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement